: బాబు మాటకు కట్టుబడి జేసీని గౌరవిస్తున్నాం: ‘చంద్ర దండు’ వ్యవస్థాపక అధ్యక్షుడు
ఏపీ సీఎం చంద్రబాబు మాటకు కట్టుబడి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని గౌరవిస్తున్నామని ‘చంద్ర దండు’ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు అన్నారు. చంద్రబాబుపై జేసీ నిన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు. చంద్రబాబు కృషి వల్లే ఎన్నికల్లో గెలిచామని, జేసీకి దమ్ముంటే టీడీపీని వదిలి విడిగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కాగా, కేవలం చంద్రబాబు వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదని, దాని వెనుక చాలా మంది కష్టం ఉందని జేసీ దివాకర్ రెడ్డి నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.