: ఆర్బీఐకి కొత్త నిర్వచనం చెప్పిన కాంగ్రెస్ పార్టీ!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు కాంగ్రెస్ పార్టీ కొత్త నిర్వచనం చెప్పింది. ఆర్బీఐను రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలిచింది. రూ. 5000లకు మించి ఇకపై ఒక్కసారే బ్యాంకులో డిపాజిట్ చేయాలని సోమవారం నాడు ఆర్బీఐ నిబంధన విధించింది. ఈ రోజు ఆ పరిమితిని ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో, ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా విమర్శించారు. నవంబర్ 8వ తేదీ నుంచి ఆర్బీఐ విధిస్తున్న నిబంధనలు, తీసుకుంటున్న యూటర్న్ లు చూస్తుంటే... దాన్ని రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగానే పిలవాలని ఆయన ఎద్దేవా చేశారు.