: ఇష్టమైన అమ్మాయితో పెళ్లికి నిరాకరించిందని కన్నతల్లినే కాల్చి చంపేశాడు!


తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో, కన్న తల్లినే కాల్చి చంపాడో పుత్రరత్నం. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, భోపాల్ గౌతంనగర్ ప్రాంతంలో బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా జమీలాబి పనిచేస్తున్నారు. ఆమెకు అమన్ (22) అనే కుమారుడు ఉన్నాడు. స్థానికంగా ఉన్న ఓ అమ్మాయిని ఇష్టపడ్డ అమన్... ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తల్లితో చెప్పాడు. అయితే, అందుకు ఆమె ఒప్పుకోలేదు. తాను ఎంపిక చేసిన అమ్మాయితోనే నీ పెళ్లి జరుగుతుందని ఆమె తేల్చి చెప్పారు. దీంతో వీరిద్దరికీ వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో, గత నెల 30న .315 కంట్రీ మేడ్ పిస్టల్ తో తల్లిని కాల్చి చంపేశాడు.

ఆ తర్వాత ఎవరో వచ్చి తన తల్లిని కాల్చి చంపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అమన్. అయితే, అతని వ్యవహారశైలి కొంచెం అనుమానాస్పదంగా ఉండటంతో, అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దీంతో, అసలు విషయం వెలుగు చూసింది. 

  • Loading...

More Telugu News