: సామాన్యుడిపై పడనున్న మరో పిడుగు... సంకేతాలిచ్చిన ఆర్థిక మంత్రి జైట్లీ


ఇప్పటికే అనేక రంగాల్లో వివిధ సేవలకు సర్వీస్ ఛార్జెస్ వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే రైల్వే బడ్జెట్ లో ఛార్జీలు పెంపు ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలు ఇచ్చారు. ప్రయాణికులు తాము పొందుతున్న సేవలకు ఛార్జీలు చెల్లించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. ఈ సారి రైల్వే బడ్జెట్ లో ప్రజాకర్షక పథకాలు ఏవీ ఉండవని తేల్చి చెప్పారు. కేవలం రైల్వే పనితీరును మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపైనే ఎక్కువ దృష్టి ఉంటుందని చెప్పారు.

ఇప్పటి వరకు రైల్వే తాను చేస్తున్న ఖర్చులో కేవలం 57 శాతాన్ని మాత్రమే ప్రయాణికుడి నుంచి వసూలు చేస్తోందని... మిగిలిన మొత్తాన్ని సబ్సిడీగా భరిస్తోందని తెలిపారు. 2003 వరకు విద్యుత్ రంగం నష్టాల్లో నడిచిందని... సంస్కరణలు తీసుకువచ్చిన తర్వాత విద్యుత్ రంగం మెరుగుపడిందని జైట్లీ తెలిపారు. టోల్ గేట్ చెల్లింపులు మొదలుపెట్టిన తర్వాతనే జాతీయ రహదారులు మెరుగుపడ్డాయని చెప్పారు. ఇదే విధంగా రైల్వేలను కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

  • Loading...

More Telugu News