: డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో చేరిన ఒరాకిల్ సీఈఓ... ఆగ్రహంతో రాజీనామా చేసిన డైరెక్టర్
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఒరాకిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాఫ్రా కాట్జ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సంస్థ డైరెక్టర్ జార్జ్ ఏ పొలిస్నర్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికాకు అధ్యక్షుడు కానున్న డొనాల్డ్ ట్రంప్ కు మద్దతివ్వాలని ఆయన, పరివర్తన టీములో చేరాలని సాఫ్రా నిర్ణయించుకోగా, దీన్ని పొలిస్నర్ తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్, ఇమిగ్రేషన్ పాలసీలపై పనిచేయనున్నట్టు సాఫ్రా తెలుపగా, తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను ట్రంప్ కోసం పని చేసేదిలేదని స్పష్టం చేసిన పొలిస్నర్, తన రాజీనామాను లింక్డ్ ఇన్ ద్వారా పంపారు. కాగా, 1993 నుంచి ఒరాకిల్ లో ఆయన పనిచేస్తూ, కన్సల్టింగ్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, కస్టమర్ అడ్వకసీ, ప్రొగ్రామ్ మేనేజ్ మెంట్, క్లౌడ్ విభాగాల్లో సేవలందించారు.