: భారీ మొత్తంలో డిపాజిట్ చేసి... ఉద్యోగం ఊడగొట్టుకున్న బ్యాంక్ అధికారి


తన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లో అక్రమంగా రూ. 25.44 లక్షలకు పైగా డిపాజిట్ చేసుకుని, చివరకు ఉద్యోగాన్నే ఊడగొట్టుకున్నాడు ఓ బ్యాంకు అధికారి. వివరాల్లోకి వెళ్తే, అగర్తలాలోని యూసీఓ బ్యాంకులో మెలాఘర్ బ్రాంచులో హెడ్ క్యాషియర్ గా పనిచేస్తున్న దిలీప్ డెబ్బర్మ... పెద్ద నోట్లు రద్దైన తర్వాత కోల్ కతాలోని తమ బ్యాంకు ప్రధాన కార్యాలయంలోని తన పర్సనల్ అకౌంట్ లో రూ. 25,44,500 డిపాజిట్ చేశాడు. దీన్ని గమనించిన బ్యాంక్ విజిలెన్స్ వింగ్ దర్యాప్తు జరిపి, దిలీప్ అక్రమానికి పాల్పడినట్టు నిర్ధారించింది. దీంతో సదరు బ్యాంకు అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన తర్వాత దిలీస్ ఈ అక్రమానికి పాల్పడ్డాడు.  

  • Loading...

More Telugu News