: కాలునొప్పితో జీవితాంతం సమస్య తప్పదన్నారు: బాబు
పాదయాత్ర చేస్తున్న సమయంలో తలెత్తిన కాలు నొప్పితో జీవితాంతం సమస్య తప్పదని వైద్యులు హెచ్చరించారని బాబు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టూడియోలో ఉన్నారు. అయితే, తాను ఆ సమయంలో రాష్టం కోసం ఆలోచించానని, ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర ఆపకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. రాత్రి, పగలు ప్రజల కష్టాలే కళ్ళల్లో మెదిలేవని బాబు అన్నారు.
తాను, పాదయాత్ర చేసిన కాలంలో ఎక్కువమంది యువత ఉద్యోగాల్లేక అలమటించడం చూశానని బాబు చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడం చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన పాలనలో సృష్టించిన సంపదను వైఎస్ హయాంలో దోచుకున్నారని బాబు మండిపడ్డారు.