: ఏసీబీ వలలో రెడ్డిగూడెం ఎస్సై.. రూ.5 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వైనం!


ఏసీబీ వలకు కృష్ణా జిల్లా రెడ్డిగూడెం ఎస్సై వీరవెంకట సత్యనారాయణ చిక్కారు. ఓ వాహనదారుడి  నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. నోట్ల మార్పిడి ముఠా పేరుతో కొందరు యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చిన ఎస్సై వారి బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తిరిగి ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారి నుంచి ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News