: ప్యాకేజీకి అంగీకారం ఎందుకంటే.. మరోమారు స్పష్టం చేసిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఇతర ముఖ్యనేతల వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించడాన్ని కొందరు విమర్శిస్తున్నారని అన్నారు. విజ్ఞతతో ఆలోచించి, బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ప్యాకేజీకి సరే అన్నానని వివరించారు. రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయాయని, మిగతా రెండున్నరేళ్లలో రాష్ట్రానికి ఏమీ రాకపోతే నష్టం, కష్టం తప్పవని అన్నారు. ఈనెల 26న జరగనున్న నాబార్డు సమావేశం తర్వాత నిధుల విడుదల మొదలవుతుందని చంద్రబాబు వివరించారు.

  • Loading...

More Telugu News