: తిరుమల శ్రీవారి పాతనోట్లను తీసుకోనన్న బ్యాంకు అధికారులు!


తిరుమల శ్రీవారి పాతనోట్లను తీసుకునేందుకు బ్యాంకులు నిరాకరించాయి. శ్రీవేంకటేశ్వరుడి హుండీ ద్వారా ఈరోజు రూ.2.47 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో పాత ఐదొందలు, వెయ్యినోట్లు రూ.90 లక్షల వరకు ఉన్నాయి. నిత్యం వచ్చే హుండీ కానుకలను స్టేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులో టీటీడీ జమచేస్తుంటుంది. ఈ క్రమంలో ఆ మొత్తాన్ని ఆయా బ్యాంకుల్లో జమ చేసేందుకు టీటీడీ అధికారులు వెళ్లారు. అయితే, పాతనోట్లను తీసుకోని బ్యాంకు అధికారులు, మిగిలిన నోట్లను తీసుకున్నారు. ఈ నెల 30 లోపు ఒకేసారి పాతనోట్లను జమ చేయాలనే షరతు పెట్టాయి బ్యాంకులు. ఈ నేపథ్యంలో ఆర్బీఐకి ఒక లేఖ రాయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.  

  • Loading...

More Telugu News