: 'శివ టు వంగవీటి' గురించి ఏం చెప్పాలి?: వెంకటేష్


'శివ టు వంగవీటి' గురించి చెప్పాలంటే చాలా ఉంటుందని ప్రముఖ నటుడు వెంకటేష్ అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన 'శివ టు వంగవీటి' వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'శివ' తెలుగు సినీ పరిశ్రమ పోకడను మాత్రమే కాదని, భారతీయ సినీ పరిశ్రమ పోకడను పూర్తిగా మార్చేసిందని అన్నారు. 'ఆ తరువాత తనతో సినిమా తీస్తానని వర్మ చెప్పగానే, 'శివ'కి బాబు లాంటి సినిమా తీస్తాడనుకున్నాను... 'శివ'లో నాగార్జునను పరుగెత్తించాడు, అలాంటిది 'క్షణక్షణం'లో నన్నేమో కూర్చేపెట్టేవాడు' అంటూ నవ్వుతూ చెబుతూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. వీడేంట్రా బాబు నాగార్జునను పరుగెత్తించాడు. నన్ను కూర్చోబెడుతున్నాడని అనుకునేవాడినని అన్నారు. ఎలా అయితేనేం ఒక డిఫరెంట్ జానర్ లో అద్భుతమైన సినిమాను తనకు ఇచ్చాడని ఆయన కితాబునిచ్చారు. సినిమా పూర్తైన తరువాత తన దగ్గరకు వచ్చి బయట అందరూ 'క్షణక్షణం' సినిమాలో శ్రీదేవికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి, వెంకీకి తక్కువ ప్రాముఖ్యతనిచ్చానని అంటున్నారని, 'అది నిజమా? నీకలా అనిపించిందా? అని అడిగాడని, అలా అడిగితే ఏం చెబుతాం?' అని వెంకీ అనగానే అంతా నవ్వేశారు. 

  • Loading...

More Telugu News