: రాజీపడే ప్రసక్తే లేదు...పోరాటం ఆపను: సైరస్ మిస్త్రీ
ఎట్టి పరిస్థితుల్లోనూ రతన్ టాటాతో రాజీ పడే ప్రసక్తి లేదని, తన పోరాటం కొనసాగిస్తానని సైరస్ మిస్త్రీ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, టాటా గ్రూప్ లో తన కుటుంబానికి 18.5 శాతం వాటా ఉందని, దాని విలువ 103 బిలియన్ డాలర్లని , దానిని వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం తాను చేసే పోరాటాన్ని ఆపనని, యాభై సంవత్సరాలుగా తాము ఈ గ్రూప్ లో ఉన్నామని అన్నారు. పదవి కోసం, అధికారం కోసం తాను పాకులాడటం లేదని, అందుకే, తనంతట తానుగా తప్పుకున్నానని చెప్పారు. తాను బోర్డులో పదవుల కోసం చూడటం లేదని, మంచిపాలన కోసం చూస్తున్నానని, భవిష్యత్ లో అది జరుగుతుందని తాను ఆశిస్తున్నానని మిస్త్రీ ఆశాభావం వ్యక్తం చేశారు.