: డ్రీమ్ లాంచ్ కష్టం అనుకుంటే... నాకు డ్రీమ్ 'రీలాంచ్' ఇచ్చారు: 'వంగవీటి' నటుడు వంశీ


ప్రస్తుత తరుణంలో డ్రీమ్ లాంచే కష్టం అనుకుంటే... తనకు రాంగోపాల్ వర్మ డ్రీమ్ రీ లాంచ్ ఇచ్చారని 'హ్యాపీడేస్' ఫేమ్... 'వంగవీటి' సినిమాలో 'దేవినేని మురళి' పాత్రధారి ఛాగంటి వంశీ తెలిపాడు. హైదరాబాదులో నిర్వహించిన 'శివ టు వంగవీటి' వేడుకలో వంశీ మాట్లాడుతూ, సాధారణంగా అంతా అగ్నికి ఆజ్యం తోడవుతుందని అంటారని, దర్శకుడు రాంగోపాల్ వర్మ అగ్ని అయితే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఆజ్యమని అన్నాడు. వర్మకు కిరణ్ అన్ని విధాలుగా అండగా నిలిచాడని తెలిపాడు. తనకు వర్మ అద్భుతమైన అవకాశం ఇచ్చారని చెప్పాడు. 'వంగవీటి' సినిమా అద్భుతంగా వచ్చిందని, విడుదలైన తరువాత చూసి అంతా ఆశ్చర్యపోతారని వంశీ తెలిపాడు. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు. 

  • Loading...

More Telugu News