: రాహుల్ గాంధీని కలిసిన సిద్దూ.. 45 నిమిషాల భేటీ!


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ కలిశారు. ఢిల్లీలోని రాహుల్ నివాసానికి వెళ్లిన సిద్ధూ ఆయనతో సుమారు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంజాబ్ రాజకీయాలు, పొత్తులు, అసెంబ్లీ ఎన్నికలు, ప్రత్యర్థులను ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చించారు. వీరి కలయిక పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. తాజాగా చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, అకాలీదల్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి కలయిక ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఎలాంటి మార్పులకు కారణమవుతుందోనని రాజకీయ విశ్లేషకులు గమనిస్తున్నారు. 

  • Loading...

More Telugu News