: ఆస్తులను జప్తు చేసినా.. జగన్ తీరు మాత్రం మారడం లేదు: చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు కురిపించారు. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తాము ఎంతో ప్రయత్నిస్తున్నామని... జగన్ మాత్రం ప్రతి విషయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆస్తులను ఈడీ జప్తు చేసినప్పటికీ... జగన్ లో మాత్రం మార్పు రావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విష ప్రచారాలను టీడీపీ నేతలు తిప్పి కొట్టాలంటూ పిలుపునిచ్చారు.
బందర్ పోర్టు, భోగాపురం విమానాశ్రయం, ఆక్వా ఫుడ్ పార్క్ లాంటివి వద్దంటూ ఆందోళనలు చేస్తూ, ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ, రాష్ట్ర ఉన్నతిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఫార్మా కంపెనీలు పెడితే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని... అయితే, అక్కడకు కూడా వెళ్లి యువతను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి పరిశ్రమలే రాకుండా జగన్ అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.