: ఫిక్సెడ్ డిపాజిట్ల అటాచ్ పై స్టే ఇవ్వండి: హైకోర్టులో జగన్ పిటిషన్
తమ కంపెనీలకు చెందిన ఫిక్సెడ్ డిపాజిట్లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకోవడంపై వైకాపా అధినేత వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ అక్రమాస్తుల కేసులో నిన్న ఈడీ నుంచి ప్రకటన రాగా, ఈ నిర్ణయంపై స్టే విధించాలని ఆయన నేడు పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ డీలను అటాచ్ చేయకుండా ఆదేశించాలని, ఈ విషయంలో తాము అపిలేట్ అథారిటీకి వెళ్లాలని భావిస్తున్నందున, అంతవరకూ స్టే విధించాలని పిటిషన్ లో జగన్ కోరారు. ఈ పిటిషన్ పై వాదోపవాదనల అనంతరం కోర్టు నిర్ణయం తీసుకోనుంది.