: పెట్రోల్ ధర తగ్గిందోచ్
వాహనదారులకు శుభవార్త. పెట్రోల్ ధర మరోసారి తగ్గింది. లీటర్ పెట్రోల్ పై రూ. 3లు తగ్గిస్తూ నేడు భారత చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు తగ్గడమే భారత్ లో పెట్రోల్ ధరల సవరింపునకు కారణం.