: ఉగ్రవాదుల కోడ్ లు 'నిఖా', 'బారాతీ'... వీటి అర్థాలు ఏమిటంటే..!
ఉగ్రవాదులు తమ ఆపరేషన్ లో భాగంగా ఒక్కో దానికి ఒక్కో కోడ్ పెట్టుకుంటుంటారు. ఇంటెలిజెన్స్ వర్గాల ట్యాప్ లో పడకుండా ఉండడానికి ఇలా చేస్తుంటారు. తమ కుట్రలు తమకు మాత్రమే అర్థమయ్యే రీతిలో కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తుంటారు. నిఖా, బారాతీ లాంటి కోడ్ లను ఈ మధ్యకాలంలో వారు వినియోగించారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి సందర్భంగా వారు ఈ కోడ్ లను వాడారు. పఠాన్ కోట్ పై దాడికి 'నిఖా' అనే కోడ్ పెట్టారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు 'బారాతీ' అనే కోడ్ పెట్టారు. ఈ వివరాలను ఎన్ఐఏ వెల్లడించింది. ఉగ్రదాడికి సంబంధించి దాఖలు చేసిన చార్జ్ షీట్ లో... ఈ దాడికి కేవలం జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ మాత్రమే ప్లాన్ చేయలేదని... అందులో పాక్ అధికారుల హస్తం కూడా ఉందని తెలిపింది. ఈ దాడిలో మొత్తం ఏడుగురు భద్రతా సిబ్బంది దుర్మరణం చెందగా, మరో 37 మంది గాయపడ్డారు.