: ఆదాయ పన్ను పరిమితుల్లో మార్పు.. పన్ను మినహాయింపు పరిధిని రూ.4 లక్షలకు పెంచే అవకాశం?
ఆదాయ పన్ను పరిమితుల్లో మార్పులు చేసే అవకాశాలు కన్పిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు పరిధిని రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయంపై పది శాతం, రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 15 శాతం, రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 20 శాతం, రూ.20 లక్షలకు పైగా ఆదాయంపై 30 శాతం పన్ను విధించే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫ్రాంక్ నోరోన్ స్పందిస్తూ.. ఈ వార్తలన్నీ వదంతులేనని వ్యాఖ్యానించారు.