: టాటా గ్రూప్ లోని అన్ని సంస్థలకు మిస్త్రీ రాజీనామా
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూప్ లోని అన్ని సంస్థలకు ఆయన రాజీనామా చేశారు. కాగా, చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తొలగించిన అనంతరం, రతన్ టాటాపై ఆయన పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. రతన్ టాటా కూడా అదే స్థాయిలో స్పందించడం, ఇన్వెస్టర్లకు లేఖలు రాయడం విదితమే.