: దయచేసి వదంతులు ఆపండి.. నేను రహస్య వివాహం చేసుకోలేదు: మల్లికా షెరావత్
తాను రహస్య వివాహం చేసుకున్నానంటూ ఒక ఆంగ్లపత్రికలో వెలువడ్డ కథనంపై బాలీవుడ్ ప్రముఖ నటి మల్లికా షెరావత్ స్పందించింది. ‘దయచేసి వదంతులు ఆపండి.. నేను రహస్య వివాహం చేసుకోలేదు. నా పై అసత్య వార్తలతో కథనాలను ప్రచురించడం తగదు’ అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కాగా, ‘మర్డర్’, ‘ద మిత్’, ‘హిస్’, ‘దశావతారం’ వంటి చిత్రాల్లో నటించిన మల్లికా షెరావత్, పలు విదేశీ చిత్రాల్లో కూడా నటించింది.