: అశ్విన్ అవుట్...నాయర్ బతికి పోయాడు


టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవుటయ్యాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 171వ ఓవర్ నాలుగో బంతిని అశ్విన్ లాఫ్టేడ్ షాట్ గా కొత్తగా దానిని జోస్ బట్లర్ అద్భుతంగా ఒడిసిపట్టేశాడు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అనంతరం కరణ్ నాయర్ (227)కు రవీంద్ర జడేజా (4)  జతకలిశాడు. 172వ ఓవర్లో 4వ బంతిని నాయర్ ముందుకు వచ్చి ఆడాడు. ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి, స్లిప్ లో ఉన్న జో రూట్ చేతుల్లో పడింది. దీనిని రూట్ జారవిడవడంతో నాయర్ బతికిపోయాడు. ప్రస్తుతం వీరిద్దరూ దూకుడుగా ఆడుతున్నారు. డబుల్ సెంచరీ చేసిన నాయర్ భారీ షాట్లు అడే ప్రయత్నంలో ఉండగా, జడేజా కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఇప్పటికే ఓ మోస్తరు ఆధిక్యంలోకి వచ్చినా కోహ్లీ ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయకపోవడం విశేషం. దీంతో టీమిండియా 174 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 633 పరుగులు చేసింది. 

  • Loading...

More Telugu News