: రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కావాలి: టీజీ వెంకటేశ్
ఓ పక్క ప్రత్యేక తెలంగాణ నిర్ణయం అంశంపై కేంద్రం తర్జనభర్జనలు పడుతుంటే, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి మంత్రి టీజీ వెంకటేశ్ తనదైన వాణిని వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని టీజీ కోరారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో కూడా ఆందోళనలు చెలరేగుతాయని హెచ్చరించారు. అయితే కేంద్రం అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొనే విభజనపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.