: గెలాక్సీ నోట్ 7 పేలుళ్ల కారణం కనుగొన్నాం: శాంసంగ్


శాంసంగ్ విడుదల చేసిన గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లు పేలి, సంస్థ పేరును దెబ్బతీయడమే కాకుండా, భారీ నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో, ఫోన్లు పేలిన కారణాన్ని కనుగొన్నామని సంస్థ ప్రకటించింది. పేలుడు మూల కారణాన్ని గుర్తించామని, విషయాన్ని కొరియా టెస్టింగ్ ల్యాబోరేటరీ సహా ఇతర రెగ్యులేటరీ సంస్థలకు సమర్పించామని ఓ ప్రకటనలో వెల్లడించిన శాంసంగ్, ఈ వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. గెలాక్సీ నోట్ 7 పేలుళ్ల తరువాత, ఫోన్లలన్నింటినీ రీకాల్ చేసిన సంస్థ వాటిని కొత్తగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు చెప్పినా, సమస్య వెంటాడటంతో, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసిన కంపెనీ, రిపోర్టును తయారు చేయించుకుంది. ఇక ఫోన్లలో సమస్య తెలిసింది కాబట్టి, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మరోసారి గెలాక్సీ నోట్ 7లను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News