: జాతీయగీతాన్ని అవమానించిన రచయితపై రాజద్రోహం కేసు నమోదు


జాతీయగీతాన్ని అవమానిస్తూ ఓ రచయిత ఫేస్ బుక్ లో పోస్టు పెట్టడంతో... ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే, మలయాళీ రచయిత, థియేటర్ ఆర్టిస్ట్ అయిన కమల్ సీ చవరా జాతీయగీతాన్ని అవమానపరిచేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజద్రోహం కేసును నమోదు చేశారు. గతంలో ఆయన చేసిన ఫేస్ బుక్ పోస్టులను కూడా పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. కమల్ పోస్టులపై కేరళ రాష్ట్ర బీజేపీ యువ మోర్చా కొల్లంలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో, కోజికోడ్ లో ఉన్న కమల్ ను కొల్లంకు పోలీసులు తీసుకొచ్చారు. 

  • Loading...

More Telugu News