: జయలలిత సంపద అంతా ప్రజలకే చెందితే బాగుంటుంది: విజయశాంతి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు ఎవరికి చెందాలనే అంశంపై విజయశాంతి స్పందించారు. మొదట జయలలిత ఎవరికి వీలునామా రాశారో అధికారులు చూసుకోవాల్సి ఉందని ఆమె అన్నారు. ఒకవేళ ఆమె వీలునామాలో ఏమయినా రాసి ఉంటే వారికే చెందుతుంది కదా అని వ్యాఖ్యానించారు. తాను మాత్రం జయలలిత సంపద అంతా ప్రజలకే చెందితే బాగుంటుందని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలనే ఆమె కుటుంబంలా భావించారు కాబట్టి, జయలలితకు సంబంధించిన సంపద అంతా వారికే చెందాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కాగా, తన రాజకీయ జీవితంపై విజయశాంతి స్పందిస్తూ.. తాను రాజకీయాల్లో చిన్న విరామం మాత్రమే తీసుకున్నానని అన్నారు. త్వరలోనే చేయాల్సిన పనులు అన్నీ చేస్తానని, ప్రజల ముందుకు వస్తానని చెప్పారు.