: ‘ఆధార్’ ఉంటే విమానాశ్రయంలోకి అనుమతి
ఆధార్ నంబర్ అన్నింటికీ ఆధారంగా మారుతోంది. విమానాశ్రయాల్లోకి ప్రవేశానికీ ఆధార్ నంబర్ కీలకం కాబోతుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా నడుస్తున్న ఆధార్ ఎంట్రీ విధానాన్ని ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లోనూ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో ఆధార్ నంబర్ తో వెళ్లే అవకాశాన్ని ప్రయోగాత్మకంగా గతేడాది ప్రారంభించారు. ప్రవేశ మార్గం వద్ద ప్రయాణికుడు ఆధార్ నంబర్ చెప్పగానే సిబ్బంది అతడి గుర్తింపును సరిచూసి అనుమతిస్తున్నారు. కేవలం ఒకే ప్రవేశ ద్వారం వద్ద ఇది అమల్లో ఉంది. తాజాగా దీన్ని అన్ని గేట్ల వద్ద అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనల్లో అధికారులు ఉన్నారు. ఆధార్ నంబర్ లేకపోతే ఇతర గుర్తింపు ధ్రువపత్రాలను చూపించినా అనుమతించనున్నారు. ఆధార్ నంబర్ వల్ల చెకింగ్ అనేది వేగంగా జరుగుతుందని అధికారులు తెలిపారు.