: బాలికకు మత్తిచ్చి ముగ్గురు అఘాయిత్యం... ఢిల్లీలో దారుణం


మహిళలపై నేరాల విషయంలో నిత్యం వార్తల్లో ఉండే దేశ రాజధానిలో మరో బాలికపై దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీలో తొలిసారిగా అడుగుపెట్టిన ఓ 16 ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు ఐదు గంటల పాటు అత్యాచారం జరిపారు. తూర్పు ఢిల్లీలో అశోక్ నగర్ ప్రాంతంలో గురువారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. ముగ్గుర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ లోని ముజఫర్ పూర్ కు చెందిన 16 ఏళ్ల బాలిక ఢిల్లీలో ప్రమాదానికి గురై మంచంపాలైన తన బంధువులను చూసుకునేందుకు వచ్చింది.

 వారు అద్దెకు ఉండే ఇంటి యజమాని, అతడి స్నేహితుల కన్ను ఆమెపై పడింది. గురువారం రాత్రి మంచి నీళ్లు తాగడానికి ఇంటి బయటకు వచ్చిన ఆమెపై ఒక్కసారిగా ఇద్దరు దాడి చేసి మత్తు మందు చల్లిన చేతి రుమాలును ఆమె ముక్కు వద్ద ఉంచడంతో స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెను ఇంటిపైన ఉన్న గదిలోకి తీసుకెళ్లారు. తొలుత ఆ ఇద్దరూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ ఇంటి యజమాని కూడా బాలికపై అత్యాచారం చేశాడు. పార్షికంగా స్పృహతో పడిపోయి ఉన్న ఆమెను కొంత సేపటి తర్వాత ఆమె సోదరుడు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో పలు సెక్షన్ల కింద వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

  • Loading...

More Telugu News