: అధికారి ఇంట్లో తనిఖీలు.. నిన్న 2 కోట్ల విలువైన ఆస్తులు సీజ్.. నేడు 3 కేజీల బంగారం, 15 కేజీల వెండి సీజ్
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తోన్న ఏసీబీ అధికారులు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కె. లక్ష్మణ భాస్కర్ వద్ద భారీగా నల్లధనం ఉందని తెలుసుకొని అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో 14 చోట్ల దాడులు జరిపి రూ. 2 కోట్ల విలువైన ఆస్తులను నిన్న సీజ్ చేశారు. ఆయనకు సంబంధించిన ఇళ్లలో రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సీతాఫల్‌మండిలోని హార్మోని హైట్స్‌లో ఆయనకు ఉన్న ఓ ఇంట్లో 3 కేజీల బంగారం, 15 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా బయటపడ్డాయి. దీంతో భాస్కర్‌ను అరెస్టు చేసిన అధికారులు ఆయనను విశాఖపట్నంకు తరలిస్తున్నారు.