: గోల్‌మాల్ లెక్కలు పోయి క్లీన్ సొసైటీ వస్తుందన్న నమ్మకం ఉంది!: కేసీఆర్
బ్యాంకు ఉద్యోగులు నిజాయతీపరులని అనుకునేవాడినని, కానీ వాళ్లలోనూ అవినీతిపరులున్నారని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తోందన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని సంపూర్ణ ప్రక్షాళన దిశగా నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన శ్రీకారం చుట్టిన మంచి కార్యాన్ని ఎందుకు వ్యతిరేకించాలని ప్రశ్నించారు. గోల్‌మాల్ లెక్కలు పోయి క్లీన్ సొసైటీ వస్తుందన్న నమ్మకం తనకుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మోదీ చేస్తున్న దాన్ని గుడ్డిగా వ్యతిరేకించబోమని, అలాగే గుడ్డిగా మద్దతు కూడా తెలపబోమని స్పష్టం చేశారు. బ్యాంకు ఉద్యోగులు నిజాయతీపరులని ఇన్నాళ్లూ అనుకున్నానని, కానీ వారిలో కొందరు అవినీతిపరులున్నారని తేలిందని కేసీఆర్ అన్నారు.