: వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లో సింధు ఓటమి
బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ సెమీస్ లో పివి సింధు పరాజయం పాలైంది. కొరియాకు చెందిన సంగ్ హ్యూన్ పై సింధు పోరాడి ఓడింది. సంగ్ హ్యూన్ చేతిలో 15-21,21-18,15-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. మొదటి సెట్ ను కోల్పోయిన సింధు, రెండో సెట్ లో తన సత్తా చూపించి, దానిని కైవసం చేసుకుంది. అయితే, మూడో సెట్ ను సొంతం చేసుకునేందుకు సింధు పడిన కష్టం ఫలించకపోవడంతో ఆ గేమ్ ను కోల్పోవాల్సి వచ్చింది.