: పెళ్లి సంబంధాల పేరిట మోసం.. ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చి దోచుకుపోయిన వైనం!
విశాఖపట్టణంలో పెళ్లి సంబంధాల పేరిట ఒక వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. అక్కయ్యపాలెంలోని విష్ణునారాయణ కుటుంబానికి సత్యనారాయణ పేరుతో ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో విష్ణు నారాయణ కుటుంబానికి నిన్న రాత్రి మత్తు మందు కలిపిన ప్రసాదాన్ని ఆ వ్యక్తి ఇచ్చాడు. అనంతరం ఆ కుటుంబసభ్యులు స్పృహ కోల్పోగానే వారి ఇంట్లోని రూ.2 లక్షలు, 750 గ్రాముల బంగారాన్ని అపహరించుకుపోయాడు. ఈరోజు మధ్యాహ్నం స్పృహలోకి వచ్చిన విష్ణునారాయణ కుటుంబసభ్యులకు జరిగిన విషయం అర్థమైంది. దీంతో, నాలుగో పట్టణ పోలీసులకు ఈ మేరకు బాధితులు ఫిర్యాదు చేశారు.