: వైగో వాహనంపై రాళ్లు రువ్విన డీఎంకే కార్యకర్తలు


డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించేందుకు వెళ్లిన ఎండీఎంకే నేత వైగోను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించేందుకు కొద్దిసేపటి క్రితం ఆయన వెళ్లారు. అయితే, ఆసుపత్రిలోకి వెళ్లనీయకుండా ఆయన వాహనాన్ని డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.  ప్రస్తుతం కావేరి ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News