: చెన్నయ్ టెస్టు: మొదటి ఇన్నింగ్స్ లో 477 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆలౌట్
చెన్నయ్‌లో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచులో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆలౌటయ్యారు. ఇంగ్లండ్ టెయిలెండర్లు ఎవరూ ఊహించని విధంగా రాణించడంతో ఇంగ్లండ్ 477 పరుగుల స్కోరు నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో కుక్ 10, జెన్నింగ్స్ 1, రూట్ 88, మొయిన్ అలీ 146, బెయిర్ స్టో 49, స్టోక్స్ 6, బట్లర్ 5, డావ్సన్ 66 (నాటౌట్), రషీద్ 60, బ్రాడ్ 19, బాల్ 12 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేష్, ఇషాంత్ లు రెండేసి వికెట్లు తీయగా, జడేజా మూడు వికెట్లు తీశాడు. అశ్విన్, మిశ్రాలకు చెరో వికెట్ దక్కింది. ఇంగ్లండ్‌కు ఎక్స్‌ట్రాల రూపంలో 15 పరుగులు దక్కాయి. టీమిండియా ఓపెనర్స్ రాహుల్, పార్థివ్ పటేల్ క్రీజులోకి వచ్చారు.