: టర్కీలో మరోసారి సైన్యంపై బాంబు దాడి... 13 మంది సైనికుల మృతి, 48 మందికి గాయాలు
గత వారం టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్లో కుర్దిష్ మిలిటెంట్లు దాడి జరిపి 44 మంది సైనికుల ప్రాణాలు తీసిన ఘటనను మరవకముందే ఈ రోజు మరో బాంబు దాడి జరిగింది. క్యాసేరిలోని ఎరసైయెస్ యూనివర్సిటీ సమీపం నుంచి ఓ బస్సులో టర్కీ సైనిక సిబ్బంది వెళుతున్న సమయంలో ఆ బస్సును పేలుడు పదార్థాలు ఉన్న ఓ కారు ఢీ కొట్టింది. దీంతో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించి బస్సు పూర్తిగా ధ్వంసమై 13 మంది సైనికులు మృతి చెందారు. మరో 48 మందికి తీవ్రగాయాలు కాగా వెంటనే వారిని అంబులెన్సుల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.