: నిన్న రాత్రి 'బాషా' చిత్రాన్ని చూసిన కరుణానిధి!


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించింది. గొంతు, ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు. అయితే నిన్న రాత్రి ల్యాప్ టాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా 'బాషా'ను కరుణ చూశారట. ఈ విషయాన్ని ఆయన కుమార్తె కనిమొళి స్వయంగా వెల్లడించారు. మరోవైపు, కరుణ ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో... చెన్నైలోని కావేరి ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున డీఎంకే కార్యకర్తలు చేరుకుంటున్నారు. కరుణ పెద్ద కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరి కూడా మధురై నుంచి హుటాహుటీన చెన్నై చేరుకున్నారు. 

  • Loading...

More Telugu News