: కొత్త పెళ్లి కూతురికి తుపాకి చూపించి భర్త, స్నేహితుల అఘాయిత్యం.. జార్ఖండ్‌లో అమానుషం


జార్ఖండ్‌లో అమానుషం చోటుచేసుకుంది. కొత్త పెళ్లి కూతురిపై భర్త, అతడి  స్నేహితులే అఘాయిత్యానికి పాల్పడ్డారు. తుపాకితో బెదిరించి సభ్య సమాజం తలవంచుకునేలా చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాష్ట్రంలోని పల్మావు జిల్లా రహయ్యా గ్రామానికి చెందిన అఫ్జల్ అన్సారీకి ఇటీవలే వివాహమైంది. ఓ రోజు స్నేహితులు బబ్లుసింగ్, అఫ్జల్ మియాలతో కలిసి ఇంటికి వచ్చిన అన్సారీ మొదట భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం స్నేహితులతో కూడా చేయించాడు.

ఈ మొత్తం ఘటనను అన్సారీ వీడియో కూడా తీయించినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భార్యను హెచ్చరించాడు. ఆ మరుసటి రోజు వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే కేసు నమోదు చేసేందుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తిరస్కరించి తిరిగి వారిని ఇంటికి పంపేశారు. దాంతో వారు సంబంధిత డీఎస్పీ రవిని కలవడంతో, నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ రవి తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News