: వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో అదరగొట్టిన సింధు.. రియో ఒలింపిక్స్ ఓటమికి ప్రతీకారం
రియో ఒలింపిక్స్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి పీవీ సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్ -బి మూడో మ్యాచ్‌లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌పై వరుస సెట్లలో విజయం సాధించింది. 21-17, 21-13 తేడాతో వరుస సెట్లలో మట్టికరిపించింది. దీంతో రెండో స్థానానికి చేరుకుంది. ఒలింపిక్ రజత పతక విజేత అయిన సింధు సెమీస్‌లో కొరియా ప్లేయర్ జిహ్యూన్‌తో తలపడనుంది.