: ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరిన జూనియర్ హాకీ జట్టుకు భారీ ఆఫర్!
జూనియర్ హాకీ ప్రపంచకప్ సెమీస్‌లో అద్భుత పోరాటంతో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత హాకీ జట్టుకు హాకీ ఇండియా భారీ ఆఫర్ ఇచ్చింది. హోరాహోరీగా సాగిన సెమీస్ పోరులో ఆస్ట్రేలియాను 4-2తో మట్టికరిపించిన భారత్ దర్జాగా ఫైనల్లోకి ప్రవేశించింది. 15 ఏళ్ల తర్వాత జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకున్న జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఫైనల్లోకి ప్రవేశించిన జట్టు అక్కడ కూడా గెలిచి కప్పు అందుకుంటే భారీ బహుమతులు ఇవ్వనున్నట్టు హాకీ ఇండియా ప్రకటించింది. ఫైనల్లో విజయం సాధిస్తే ఒక్కో ఆటగాడికి రూ.5 లక్షల చొప్పున, సపోర్టింగ్ స్టాఫ్‌కు రూ. 2 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు పేర్కొంది.