: కరుణానిధి ఆరోగ్యంపై ఆందోళన.. భారీగా ఆస్పత్రికి చేరుకుంటున్న అభిమానులు, నాయకులు


గొంతు, ఊపిరితిత్తుల్లో సమస్యలతో గురువారం రాత్రి ఆస్పత్రిలో చేరిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుతం ఆయనకు కృత్రిమశ్వాస అందించే పరికరం(ట్రక్యోస్టమీ)తో చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఆయన శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు  పడుతుంటే గొంతుకు రంధ్రం చేసి ఈ  పరికరాన్ని అమర్చినట్టు వైద్యులు తెలిపారు. యాంటీబయాటిక్స్‌తో ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. 

ఇటీవల గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరిన కరుణానిధి ఈనెల 7వ తేదీనే డిశ్చార్జి అయ్యారు. అంతలోనే మళ్లీ ఆయన కావేరీ ఆస్పత్రిలో చేరడంతో డీఎంకే కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కరుణ ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆయన వెంట సతీమణి రాజాత్తి అమ్మాళ్, తనయుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి, సీనియర్ నేతలు ఉన్నారు. కనిమొళి కన్నీరు పెట్టుకుంటూ ఆస్పత్రి నుంచి బయటకు రావడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. అయితే తండ్రి కోలుకుంటున్నారని, ల్యాప్‌టాప్‌లో పాత సినిమాలు చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇక కరుణానిధి ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న పలు పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News