: శాతకర్ణి పాత్రలో బాబాయ్ ను అద్భుతంగా చూపించారు: జూనియర్ ఎన్టీఆర్
గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రలో తన బాబాయ్ నందమూరి బాలకృష్ణను అద్భుతంగా చూపించారని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసించాడు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రం ట్రైలర్ అద్భుతంగా ఉందని, శాతకర్ణి పాత్రలో బాబాయ్ ను అద్భుతంగా చూపించారని డైరెక్టర్ క్రిష్ కు అభినందనలు తెలిపాడు. కాగా, ఈ చిత్రం ట్రైలర్ ను ఈ రోజు కరీంనగర్ లో విడుదల చేశారు. అంతకుముందు కోటిలింగాల పుణ్యక్షేత్రంలో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.