: మహేష్ కు తోడుగా.. అన్నగా నిలబడతాను: వైఎస్ జగన్


 కాసు మహేష్ రెడ్డికి తోడుగా ఒక అన్నగా తాను నిలబడతానని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీలోకి కాసు మహేశ్ రెడ్డి ని ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మహేశ్ రెడ్డిని గురజాలకు తీసుకువస్తున్నానని, జంగా కృష్ణమూర్తిని చట్టసభల్లోకి తీసుకువస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శల వర్షం కురిపించారు. అబద్ధాలు, మోసాలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు వద్దని.. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు తన మాట తప్పారని విమర్శించారు.  

  • Loading...

More Telugu News