: నోట్ల మార్పిడి ముఠాతో చేయి కలిపిన మనోహరాబాద్ ఎస్పై అరెస్టు
నోట్ల మార్పిడి ముఠాతో కలిసి మోసానికి పాల్పడిన కేసులో మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎస్సై ఆనంద్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. రూ.91.78 లక్షలు లూటీ చేసిన కేసులో ఆనంద్ గౌడ్ తో పాటు కాళ్ల కల్ వార్డు మెంబర్ వెంకటేష్, మరో ముగ్గురిని తూప్రాన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.34.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది . కాగా, మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ కేంద్రంగా ఈ దందా జరుగుతున్నట్లు పోలీసులకు నిన్న సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఫాంహౌస్ ను డీఐజీ అకున్ సబర్వాల్, మెదక్ జిల్లా ఎస్పీ నిన్న పరిశీలించారు.