: నందిగామ జడ్పీటీసీ ప్రమీలారాణిని పరామర్శించిన జగన్
నందిగామ జడ్పీటీసీ ప్రమీలారాణిని వైసీపీ అధినేత జగన్ ఈ రోజు పరామర్శించారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె విజయవాడలోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమీలారాణిని పరామర్శించిన అనంతరం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లికి ఆయన బయలుదేరారు. అక్రమ క్వారీలను వ్యతిరేకిస్తూ, గత మూడు రోజులుగా సుద్దపల్లిలో రైతులు దీక్షను చేపట్టారు. సుద్దపల్లి చేరుకున్న జగన్... దీక్ష చేస్తున్న రైతులకు తమ మద్దతు తెలిపారు. అక్రమ క్వారీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.