: నిరసనల నుంచి పాదయాత్ర వరకు... భారీ కార్యాచరణ ప్రకటించిన కాపు నేత ముద్రగడ


కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాపు నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. ఇతర బీసీలకు అన్యాయం కలగకుండానే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. ఈ అంశానికి సంబంధించి బీసీ ముఖ్యనాయకులను కలిసి మద్దతు కోరుతున్నామని చెప్పారు. ఈ రోజు అమలాపురంలో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, భారీ కార్యాచరణను ప్రకటించారు.

ఈ నెల 18వ తేదీన అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసనలు తెలుపుతామని ముద్రగడ తెలిపారు. ఈ సందర్భంగా కాపులంతా కంచాలు, గరిటెలు పట్టుకొని ముఖ్య కూడళ్లలో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో జరిగే నిరసన కార్యక్రమంలో తాను పాల్గొంటానని ఆయన తెలిపారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రజాప్రతినిధులకు లేఖలు రాస్తామని చెప్పారు. జనవరి 9న గ్రామాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 25వ తేదీ నుంచి పాదయాత్ర చేపడతామని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లను సాధించేంత వరకు మడమతిప్పబోమని అన్నారు.

  • Loading...

More Telugu News