: నోట్ల మార్పిడిలో అవకతవకలు.. ఆంధ్రా వర్శిటీలోని పోస్టుమాస్టర్, ట్రెజరర్ అరెస్టు
నోట్ల మార్పిడి వ్యవహారంలోఆంధ్రా యూనివర్శిటీలోని పోస్టుమాస్టర్, ట్రెజరర్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. రూ.21.75 లక్షల నగదు మార్పిడిలో దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో పోస్టు మాస్టర్ లలిత, ట్రెజరర్ శ్యామ్యూల్ ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఎటువంటి ఆధారాలు తీసుకోకుండా పాతనోట్లను మార్చారనే ఆరోపణలపై వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, పెద్దనోట్ల రద్దు అనంతరం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలపై సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రా యూనివర్శిటీలోని పోస్టాఫీసులో కూడా నోట్ల మార్పిడి వ్యవహారంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు.