: ఢిల్లీలోని మోతీబాగ్ లో దారుణం...కదులుతున్న కారులో రేప్


ఢిల్లీలోని మోతీబాగ్ లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం కోసం వచ్చిన యువతిపై సీఐఎస్ఎఫ్ కు చెందిన ఉద్యోగి అత్యాచారానికి పాల్పడడం సంచలనం రేపుతోంది. అతను అత్యాచారానికి ఉపయోగించిన కారుపై కేంద్ర హోం శాఖకు చెందిన స్టిక్కర్ ఉండడంతో ఆ వ్యక్తి కేంద్ర హోం శాఖలో డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడా? అన్న అనుమానం కలుగుతోంది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే డిసెంబర్ లో ఢిల్లీలో నిర్భయ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అత్యాచారానికి పాల్పడ్డవారిపై నిర్భయ చట్టంపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ రేప్ ఘటనలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

  • Loading...

More Telugu News