: సీనియర్ నేత జానారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆగ్రహం


తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత అయిన జానారెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలపై, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడతామంటే తమకు మైక్ ఇవ్వరని... మీకు మైక్ ఇచ్చినా, గట్టిగా మాట్లాడరంటూ మండిపడ్డారు. అధికార పార్టీ వైఫల్యాలు, అప్రజాస్వామిక చర్యలపై మాట్లాడకపోతే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళతాయంటూ నిలదీశారు. సీఎల్పీ నేత ఇంత మెతకగా వ్యవహరిస్తే... పార్టీ భవిష్యత్తు ఏమవుతుందని అన్నారు. శాసనసభాపక్ష నేతగా ఇంతకుముందులానే ఇప్పుడు కూడా మీరు వ్యవహరిస్తే ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి నిన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, జానారెడ్డి మెతక వైఖరిని తప్పుబట్టారు.

కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు జానారెడ్డి సమాధానం చెబుతూ, "ఎవరైనా మాట్లాడతానంటే, నేను వద్దన్నానా? సభలో అందరికీ మాట్లాడే హక్కు ఉంది. ఎక్కువ మంది మాట్లాడటానికి మైక్ ఇవ్వాలని అడుగుతాను", అని చెప్పినట్టు సమాచారం.  

  • Loading...

More Telugu News