: ఏం తాగాలి? ఏం తినాలి?.. సోషల్ మీడియాలో ప్రధానిని నిలదీసిన పిల్లాడు
నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం సామాన్యప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో 2,000 రూపాయల నోట్లు తీసుకునేందుకు సామాన్యులు రోజుల తరబడి బ్యాంకుల ముందు, క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, నల్లకుబేరులు మాత్రం బ్యాంకులకు రాకుండానే ఇంటికి నోట్లు తెప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశప్రజలంతా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు చేతనైన రీతిలో ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ బాలుడు తన పోస్టింగ్ తో హల్ చల్ చేస్తున్నాడు.
ప్రధాని నరేంద్ర మోదీని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఆ పిల్లాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ అమ్మాయి చెబుతున్న మాటలను ఆ చిన్నారి యధాతథంగా చెప్పడంతో నెటిజన్ల కితాబులందుకుంటున్నాడు. మోదీ సమస్యల్లో ముంచేశాడు (పరేషాన్ కర్దియా మోదీనే). మేము ఏం తినాలి? (హమ్ లోగ్ క్యా ఖాయేంగే). ఏం తాగాలి? (క్యా పీయేంగే). పేదోళ్లము (గరీభ్ ఇన్సానే). సాధారణ జీవితాలు మావి (జమీన్ పే రెహతే). మోదీ ఇబ్బందులపాలు చేశాడు (మోదీనే హజాల్ మచాదియాహే). 500 నోటు లేదు, 1000 నోటు లేదు, అరే ఏం తినాలి? (500 నోట్ నహీహే, 1000 నోట్ నహీహే...అరే క్యా ఖాయ్). ఏం తాగాలి? ఇంట్లో రేషన్ కూడా లేదు (క్యా పీయే. రేషన్ నహీయే ఘర్ పే). మోదీకి తగిన శాస్తి చేయాలి ( ఏయ్ సీ కీ తైసీ మోదీకి). మోదీ పిచ్చోడా? (పాగల్ హై మోదీ). ఇలాంటి పని చేశాడేంటబ్బా? ఇలా చేస్తే మేమెలా బతకాలి? మేమేమన్నా నల్లధనం కూడబెట్టామా? మా దగ్గర నల్లధనం లేదు, రూపాయి కూడా లేదు. అనారోగ్యం వస్తే ఎలా బాగుచేసుకుంటాం? అంటూ ఆ చిన్నారి ప్రశ్నించడం అందర్నీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.