: తమిళనాడు కొత్త సీఎంకు నో కాన్వాయ్.. నో సెక్యూరిటీ.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన పన్నీర్ సెల్వం


ముఖ్యమంత్రి వరకు ఎందుకు.. ఎమ్మెల్యే వస్తున్నారంటేనే కాన్వాయ్‌, సెక్యూరిటీతో పోలీసులు నానా హంగామా చేస్తారు. అలాంటిది ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఇంకెంత ఉండాలి? కానీ అవేమీ లేకుండానే తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పన్నీర్  సెల్వం రోడ్డుపైకి వచ్చారు. ఇక సాధారణ వ్యక్తిలా రోడ్డెక్కి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన సీఎంను చూసి వాహనదారులు అవాక్కయ్యారు.

వార్ధా తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు రంగంలోకి దిగిన పన్నీర్ సెల్వం ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేయడం ఇష్టం లేక కాన్వాయ్‌ను, సెక్యూరిటీని పక్కనపెట్టారు. ఈ క్రమంలో గురువారం సహాయక చర్యలను పర్యవేక్షించి తిరిగి వస్తుండగా నందనంలోని చామియర్స్ రోడ్డులో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాల పాటు చిక్కుకుపోయి ట్రాఫిక్ కష్టాలను అనుభవించారు. ట్రాఫిక్‌లో తమతోపాటు చిక్కుకున్న ముఖ్యమంత్రిని చూసేందుకు వాహనదారులు ఆసక్తి చూపారు.

  • Loading...

More Telugu News